భారతదేశం, మార్చి 18 -- నిన్ను కోరి సీరియల్ టుడే మార్చి 18 ఎపిసోడ్ లో.. నిన్న గాక మొన్న వచ్చిన మాయ కూడా నా తప్పులను ఎత్తిచూపుతోంది. బయట వాళ్ల మాటలను కూడా పడాలా? పాత గాయాలను రేపుతుంటే నా బాధ ఎవరితో చెప్పుకోవాలి? నాలో నేను బాధపడుతున్నానని అందరి ముందు శాలిని ఎమోషనల్ డ్రామా ఆడుతుంది.

గెస్ట్ లా వచ్చినదానివి గెస్ట్ లా ఉండక ఇవన్నీ నీకు ఎందుకు? నీ హద్దుల్లో నువ్వుంటే బాగుంటుందని మాయకు శ్యామల వార్నింగ్ ఇస్తుంది. మరోవైపు శ్రుతిని కామాక్షి తిడుతుంది. అప్పుడే ట్రాఫిక్ పోలీసులు వస్తారు. కారును నడిరోడ్డు మీద వదిలేసి వెళ్తున్నారా? కారుతో పాటు మిమ్మల్ని కూడా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తానని ట్రాఫిక్ పోలీసులు అంటారు.

కారు తోస్తే రూ.2 వేలు ఇస్తామని శ్రుతి చెప్తుంది. ఓ నలుగురు తోసేందుకు ముందుకు వస్తారు. కారును తోసుకుంటూ వెళ్లిపోతారు. మరోవైపు జగదీశ్వర వేలికి...