భారతదేశం, ఏప్రిల్ 24 -- Nike Layoffs 2026: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం, వినియోగదారుల కొనుగోలు శక్తి తగ్గడం వంటి కారణాలతో దిగ్గజ సంస్థలు సతమతమవుతున్నాయి. తాజాగా ప్రముఖ క్రీడా ఉత్పత్తుల సంస్థ 'నైక్' తన గ్లోబల్ ఆపరేషన్స్ విభాగంలో సుమారు 1,400 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ఇది సంస్థ యొక్క మొత్తం పనితీరులో సుమారు 2 శాతానికి సమానం. ముఖ్యంగా టెక్నాలజీ, అంతర్జాతీయ కార్యకలాపాల విభాగాలపై ఈ లేఆఫ్స్ ప్రభావం ఎక్కువగా ఉండనుంది.

కంపెనీని ఆధునీకరించడం, ఆటోమేషన్ (యంత్రాల వినియోగం) వైపు మళ్లించడమే ఈ తొలగింపుల ప్రధాన ఉద్దేశమని తెలుస్తోంది. "ఈ మార్పుల వల్ల గ్లోబల్ ఆపరేషన్స్‌లో దాదాపు 1,400 పోస్టులు తగ్గుతాయి, ఇందులో ఎక్కువ శాతం టెక్నాలజీ విభాగం నుండే ఉన్నాయి" అని కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ వెంకటేష్ అలగిరిసామి తన సిబ్బందికి పంపిన అంతర్గత నోట్‌లో పే...