భారతదేశం, ఏప్రిల్ 28 -- TV Serial Actress Nidhi Shah OTT Debut: స్టార్ ప్లస్ ఛానెల్‌లో ప్రసారమయ్యే 'అనుపమ' సీరియల్ చూసే ప్రతి ఇంట్లో కింజల్ అంటే తెలియని వారు ఉండరు. అంతలా ఆ హీరోయిన్ పాత్రలో ఒదిగిపోయారు నిధి షా. అయితే, గత కొంతకాలంగా సీరియల్స్ నుంచి విరామం తీసుకున్న ఆమె ఇప్పుడు 'సప్నే వర్సెస్ ఎవ్రీవన్' (Sapne Vs Everyone) సీజన్-2 ద్వారా ఓటీటీ రంగంలోకి అడుగుపెడుతున్నారు.

"చాలా కాలంగా నేను ఎదురుచూస్తున్న క్షణం ఇది. కింజల్‌గా నన్ను ఎంతో ప్రేమించిన ప్రేక్షకులు, ఇప్పుడు ఈ కొత్త పాత్రలో 'నిధి'ని చూస్తారని ఆశిస్తున్నాను" అని తన ఎగ్జైట్‌మెంట్‌ను పంచుకున్నారు.

తెలుగు, హిందీ సీరియల్ నటీనటులకు ఒక సమస్య ఉంటుంది. ఒకసారి ఒక పాత్రలో హిట్ అయితే, జనం వారిని అదే పేరుతో పిలుస్తుంటారు. నిధి విషయంలోనూ అదే జరిగింది. "ఎక్కడికి వెళ్లినా నన్ను కింజల్ అనే పిలుస్తు...