భారతదేశం, ఆగస్టు 15 -- దేశంలోని నిరుద్యోగ లా గ్రాడ్యుయేట్లకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్​హెచ్ఏఐ) ఒక చక్కటి అవకాశాన్ని అందించింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఐదు యంగ్ ప్రొఫెషనల్ (లీగల్) పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఎంపికైన అభ్యర్థులను దిల్లీలోని ఎన్‌హెచ్‌ఏఐ ప్రధాన కార్యాలయంలోని భూసేకరణ (ఎల్ఏ) విభాగంలో నియమించనున్నారు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు.. గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా నేషనల్ లా స్కూల్ నుంచి లా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. క్లాట్ పీజీ 2026 ప్రవేశ పరీక్షలో సాధించిన మెరిట్ స్కోర్ ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.

ఎన్​హెచ్​ఏఐ లీగల్ యంగ్ ప్రొఫెషనల్ రిక్రూట్​మెంట్ 2026లో భాగంగా మొత్తం ఐదు ఖాళీల్లో నాలుగు అన్ రిజర్వుడ్ కేటగిరీకి, ఒకటి ఓబీసీ అభ్యర్థులకు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ లేదా ఈడబ్ల్యూఎస...