భారతదేశం, ఆగస్టు 1 -- Newtons 3rd Law OTT Release On 2 Platforms: సెకండ్ ఇన్నింగ్స్‌లో వైవిధ్యమైన పాత్రలు, కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు హీరో సుమంత్. ఇటీవల నేరుగా డిజిటల్ వేదికపైకి వచ్చిన 'అనగనగా' చిత్రం ఓటీటీ వీక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంది.

అదే జోరుతో సుమంత్ నటించిన మరో సస్పెన్స్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ 'న్యూటన్స్ థర్డ్ లా' (Newton's 3rd Law) నిన్న (జూలై 31) థియేటర్లలోకి వచ్చేసింది. సుమంత్‌తోపాటు సీనియర్ హీరో జగపతి బాబు మరో ప్రధాన పాత్ర పోషించారు. థియేట్రికల్ రిలీజ్‌తో పాటే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు కూడా బయటకు రావడం ఇంట్రెస్టింగ్‌గా మారింది.

రాజేష్ కర్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రంలో సుమంత్ పోలీస్ ఆఫీసర్ వాసుదేవ్ పాత్రలో ఒదిగిపోయారు. ఇంజినీరింగ్ విద్యార్థి వినయ్ (త్రిన...