భారతదేశం, సెప్టెంబర్ 19 -- సొంతదేశంలో డిగ్రీ పూర్తి చేసి, ఉన్నత భవిష్యత్తు కోసం విదేశీ బాట పట్టే భారతీయ విద్యార్థులకు కేవలం మంచి విశ్వవిద్యాలయంలో సీటు సాధించడమే ప్రధాన లక్ష్యం కాదు! చదువు పూర్తయిన తర్వాత అక్కడే ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి? ఎంతకాలం ఉండేందుకు అనుమతి లభిస్తుంది? అనేది అత్యంత కీలకమైన ప్రశ్న. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల వీసాల్లో ఇటీవలి కాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న తరుణంలో భారతీయ విద్యార్థులను ఆకర్షించేందుకు ఇప్పుడు న్యూజిలాండ్ ప్రభుత్వం తన పోస్ట్-స్టడీ వర్క్ వీసా నిబంధనల్లో సంచలనాత్మక మార్పులు చేసింది.

ప్రస్తుతం ఉన్న పోస్ట్-స్టడీ వర్క్ వీసాకు (పీఎస్​డబ్ల్యూవీ) అర్హత సాధించని అంతర్జాతీయ విద్యార్థుల కోసం న్యూజిలాండ్ ప్రభుత్వం ప్రత్యేకంగా 'షార్ట్-టర్మ్ గ్రాడ్యుయేట్ వర్క్ వీసా'ను ప్రవేశపెడుతోంది. 2026 నవంబర్ 16 ను...