భారతదేశం, జూన్ 16 -- గత ఆరు నెలలుగా సరికొత్త మోడళ్ల లాంచ్‌లతో భారతీయ ఆటోమొబైల్ రంగం పండగ వాతావరణాన్ని తలపిస్తోంది. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, కియా, టాటా, మహీంద్రా, రెనాల్ట్ వంటి అగ్రశ్రేణి కంపెనీలు వరుస పెట్టి కొత్త కార్లను మార్కెట్లోకి వదిలాయి. అయితే ఈ జోరు ఇక్కడితో ఆగిపోవడం లేదు! వచ్చే రెండు నెలల్లో కూడా ఇదే వేగాన్ని కొనసాగిస్తూ మరిన్ని సరికొత్త మోడళ్లు సందడి చేయనున్నాయి. ముఖ్యంగా సామాన్యులకు అందుబాటులో ఉండే 'మాస్-మార్కెట్ ఎస్‌యూవీ' విభాగంలో మూడు క్రేజీ కార్లు భారత రోడ్లపైకి రాబోతున్నాయి.

మొబైల్ మార్కెట్ లాగే కార్ల మార్కెట్లోనూ భారీ అంచనాలున్న 'టాటా సియెర్రా ఈవీ' జూన్ 30న అధికారికంగా విక్రయానికి రానుంది. ఆ తర్వాత కొద్దిరోజులకే, అంటే జులై 9, 2026న నిస్సాన్ ఇండియా తన సరికొత్త 'టెక్టాన్' ఎస్‌యూవీని ప్రపంచానికి పరిచయం చేయబోతోంది. ఇది పాపులర...