భారతదేశం, జూన్ 15 -- స్మార్ట్‌ఫోన్ ప్రియులను ఆశ్చర్యంలో ముంచెత్తేలా ప్రముఖ మొబైల్ బ్రాండ్ 'హానర్'.. ఒక సంచలన ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. బ్యాటరీ లైఫ్, డిస్‌ప్లే బ్రైట్‌నెస్ విషయంలో ఇప్పటివరకు ఉన్న అన్ని రికార్డులను తిరగరాస్తూ కంపెనీ ఒక సరికొత్త హ్యాండ్‌సెట్‌పై పనిచేస్తున్నట్లు తాజాగా ఇంటర్నెట్‌లో లీకులు వచ్చాయి. ఏకంగా 10,000ఎంఏహెచ్ కంటే పెద్దదైన బ్యాటరీ, సూర్యుడి ఎండలో కూడా అద్దంలా మెరిసిపోయేలా 10,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ డిస్‌ప్లే కలయికతో ఈ ఫోన్ రూపొందుతోంది. ఒకవేళ ఈ లీకులు నిజమైతే.. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టాప్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ల స్క్రీన్ వెలుతురును కూడా ఇది చాలా సులువుగా దాటేస్తుంది. అలాగే చైనా మొబైల్ కంపెనీల్లో ఇప్పుడు ట్రెండ్‌గా మారిన 'అల్ట్రా లార్జ్ బ్యాటరీ' కేటగిరీలో ఇది సరికొత్త బెంచ్‌మార్క్ క్రియేట్ చే...