భారతదేశం, జూన్ 14 -- భారత రక్షణ రంగంలో సరికొత్త అధ్యాయం మొదలుకానుంది. భారత సైన్యం (ఇండియన్ ఆర్మీ) తదుపరి చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ నియమితులయ్యారు. ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం రాత్రి అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.

ప్రస్తుత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది జూన్ 30న పదవీ విరమణ చేయనుండటంతో.. అదే రోజు మధ్యాహ్నం లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ ఆర్మీ చీఫ్‌గా (COAS) బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ నియామకంలో కేంద్ర ప్రభుత్వం సీనియారిటీ సూత్రాన్ని పాటించింది.

లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ ప్రస్తుతం భారత సైన్యానికి వైస్ చీఫ్‌గా సేవలందిస్తున్నారు. సైన్యంలో ఆధునికీకరణను వేగవంతం చేయడం, వ్యూహాత్మక ప్రణాళికలు రచించడంలో ఆయనకు పెట్టింది పేరు. ఖడక్వాస్లా...