భారతదేశం, ఏప్రిల్ 21 -- Netflix Web Series: టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్, 'డీజే టిల్లు' ఫేమ్ సిద్ధూ జొన్నలగడ్డ క్రేజ్ ప్రస్తుతం మామూలుగా లేదు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ యంగ్ హీరో.. ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై కూడా తన సత్తా చాటడానికి సిద్ధమయ్యాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సిద్ధూ హీరోగా ఒక భారీ వెబ్ సిరీస్ రూపుదిద్దుకుంటోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది.

ఈ వెబ్ సిరీస్‌లో సిద్ధూ జొన్నలగడ్డ సరసన నటించే హీరోయిన్ ఎవరనే సస్పెన్స్‌కు తెరపడింది. 'గుంటూరు కారం', 'లక్కీ భాస్కర్' వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మీనాక్షి చౌదరిని ఈ ప్రాజెక్ట్ కోసం ఎంపిక చేశారు.

సిద్ధూ, మీనాక్షిల కెమిస్ట్రీ స్క్రీన్ మీద ఫ్రెష్‌గా ఉంటుందని మేకర్స్ భావిస్తున్నారు. ఇప్పటికే...