భారతదేశం, ఏప్రిల్ 17 -- Netflix Web Series: ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) తన సరికొత్త స్పోర్ట్స్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ 'గ్లోరీ' (Glory) ట్రైలర్‌ను ముంబైలో గ్రాండ్‌గా విడుదల చేసింది. బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ రివెంజ్ డ్రామాలో దివ్యేందు, పుల్కిత్ సామ్రాట్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రక్తసిక్తమైన రింగ్‌లో సాగే ఈ ఫైట్ మే 1 నుండి ప్రేక్షకుల ముందుకు రానుంది.

ముంబైలో ఏప్రిల్ 17న జరిగిన ఈ వేడుకలో నెట్‌ఫ్లిక్స్ 'గ్లోరీ' ప్రపంచాన్ని ఆవిష్కరించింది. కేవలం ఒక స్పోర్ట్స్ డ్రామాగానే కాకుండా, ఇందులో లోతైన క్రైమ్ మిస్టరీని జోడించారు.

ప్రతి పంచ్ వెనుక ఒక రహస్యం, ప్రతి రౌండ్ వెనుక ఒక ఎమోషనల్ ప్రతీకారం దాగి ఉంటుందని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. 'మిర్జాపూర్' ఫేమ్ కరణ్ అన్షుమన్ ఈ వెబ్ సిరీస్‌కు సృష్టికర్త కావడంతో దీనిపై భారీ అంచనా...