భారతదేశం, మార్చి 13 -- నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో థ్రిల్లర్ సినిమాలు చాలానే ఉన్నాయి. అందులోనూ మలయాళం థ్రిల్లర్లకు కొదవే లేదు. రియలిస్టిక్ యాక్టింగ్, అద్భుతమైన స్క్రీన్ ప్లేకి మలయాళ సినిమా ఇండస్ట్రీ పెట్టింది పేరు. నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ఉన్నవారు ఈ వీకెండ్ అస్సలు మిస్ కాకూడని 5 మలయాళ సినిమాలను ఇక్కడ చూడండి. వీటిలో కొన్ని మూవీస్ 'దృశ్యం' స్థాయి క్లైమాక్స్‌ను కలిగి ఉన్నాయి.

ఇది ఒక భారతీయ వలస కార్మికుడు నజీబ్ హృదయ విదారక గాథ. సౌదీ అరేబియాకు ఉపాధి కోసం వెళ్లిన నజీబ్.. అక్కడ ఎడారిలో గొర్రెలు కాసే బానిసగా ఎలా బంధీ అయ్యాడనేది ఈ సినిమా కథ. ఇది నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కింది.

నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ పాత్ర కోసం చేసిన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. మనిషి ప్రాణాల కోసం ఎంతటి కష్టాన్నైనా ఎలా ఓర్చుకుంటాడో ఈ సినిమా చూప...