భారతదేశం, సెప్టెంబర్ 14 -- Netflix Thrillers: రొటీన్ ఫార్ములా సినిమాలు కాకుండా.. సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలు అంటే మీకు ఇష్టమా? అయితే నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా అందుబాటులో ఉన్న బెస్ట్ 7 సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు మీ రాత్రి నిద్రను చెడగొట్టడం ఖాయం. ఐఎండీబీ (IMDb)లో బంపర్ రేటింగ్ సాధించిన ఈ టాప్ సినిమాలు చూస్తే చివరి నిమిషం వరకు క్లైమాక్స్ ఏంటో ఊహించలేరు.

హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ డేవిడ్ ఫించర్ తెరకెక్కించిన కల్ట్ క్లాసిక్ మూవీ 'ఫైట్ క్లబ్'. 1999లో వచ్చిన ఈ సినిమాలో బ్రాడ్ పిట్, ఎడ్వర్డ్ నార్టన్ కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు.

కార్పొరేట్ ఉద్యోగంలో విసుగొచ్చి ఇన్సోమ్నియా (నిద్రలేమి) సమస్యతో బాధపడే ఒక వ్యక్తి, సబ్బులు అమ్మే ఒక విచిత్రమైన ఫ్రెండ్‌తో కలిసి అండర్‌గ్రౌండ్ 'ఫైట్ క్లబ్' స్టార్ట్ చేస్తాడు. ఈ సినిమా ...