భారతదేశం, ఆగస్టు 27 -- Netflix Thrillers: రక్షాబంధన్ హాలీడే నాడు ఓటీటీలో ఏం చూడాలా అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ ఆగస్టు 28న లాంగ్ వీకెండ్ కంటే ముందే ఓటీటీ ప్రియులకు నెట్‌ఫ్లిక్స్ భారీ సర్‌ప్రైజ్ ప్లాన్ చేసింది. ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ నుంచి వచ్చిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఆల్ఫా'తో పాటు తెలుగు సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ 'న్యూటన్స్ థర్డ్ లా' ఒకే రోజు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు రాబోతున్నాయి.

టాలీవుడ్ సీనియర్ నటుడు సుమంత్ నటించిన మూవీ న్యూటన్స్ థర్డ్ లా. ఇదో క్రైమ్ థ్రిల్లర్ మూవీ. పోలీస్ వర్సెస్ క్రిమినల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఇంటెన్స్ థ్రిల్లర్ మూవీ ఈ 'న్యూటన్స్ థర్డ్ లా'. ఈ సినిమా శుక్రవారం (ఆగస్టు 28) నుంచే డిజిటల్ స్ట్రీమింగ్‌కు వస్తోంది. "యాక్షన్ - రియాక్షన్ అనేది ముగింపు లేని లూప్.....