భారతదేశం, సెప్టెంబర్ 7 -- Netflix Thriller: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పరిణీతి చోప్రా ఓటీటీ స్పేస్‌లోకి అడుగుపెట్టడానికి గ్రాండ్ ప్లానింగ్ చేసుకున్నారు. ఆమె నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'షక్: ట్రస్ట్ నో వన్' (Shaque: Trust No One) నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్‌కు రెడీ అయింది. సెప్టెంబర్ 24 నుంచి ఈ మైండ్ బ్లోయింగ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా అనౌన్స్ చేసింది.

ఈ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని నెట్‌ఫ్లిక్స్ ఓ ఇంటెన్స్ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేసింది. "నీటి ప్రవాహం మొదలైంది.. తేదీ దగ్గర పడుతోంది.. షక్ సెప్టెంబర్ 24 నుంచి కేవలం నెట్‌ఫ్లిక్స్ లో" అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది.

ఈ పోస్టర్ లో పరిణీతి చోప్రా తన మిస్సయిన కూతురి అన్వేషణలో భాగంగా తన చేతిలో ఓ రివ...