భారతదేశం, అక్టోబర్ 5 -- Netflix Releases: నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రైబర్లకు ఈ వారం కంటెంట్ పండుగ రాబోతోంది. అక్టోబర్ 5 నుంచి 11 మధ్యలో ఏకంగా 10 సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు డిజిటల్ స్క్రీన్‌పైకి రాబోతున్నాయి. బాలీవుడ్ స్టార్ పరిణీతి చోప్రా నటిస్తున్న 'రిపోర్టింగ్ లైవ్' క్రైమ్ థ్రిల్లర్ నుంచి మైండ్ బ్లాకింగ్ హాలీవుడ్ హారర్ మిస్టరీ మూవీస్, క్యూట్ కొరియన్ డ్రామాల వరకు ప్రతి జానర్‌లోనూ డిఫరెంట్ కంటెంట్ ఆడియెన్స్ ముందుకు వస్తోంది.

బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra), దేవేన్ భోజాని కాంబినేషన్‌లో వస్తున్న 'రిపోర్టింగ్ లైవ్' ఈ వారంలోనే మోస్ట్ ఎవైటెడ్ మూవీ. ఇసుక మాఫియా అక్రమాలను బయటపెట్టడానికి ఒక ధైర్యవంతురాలైన రిపోర్టర్, ఆమె కెమెరాపర్సన్ చేసే డేరింగ్ పోరాటం చుట్టూ ఈ కథ సాగుతుంది. ధ్రువ్ రాఠీ డైరెక్ట్ చేసిన ఈ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర...