భారతదేశం, నవంబర్ 5 -- Netflix Release: ఓటీటీ లవర్స్ అలెర్ట్. డిజిటల్ స్ట్రీమింగ్ ఫ్యామిలీ వినోదాన్ని అందించడానికి పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ కొత్త సినిమాను తీసుకొచ్చింది. డైరెక్ట్ గా నెట్‌ఫ్లిక్స్‌ మూవీగా ఈ చిత్రం ఓటీటీలోనే ఇవాళ (నవంబర్ 5) రిలీజైంది. ఆ సినిమానే ' 'దిల్‌వాలీ దివాళీ' (Dilwali Diwali). ఇదొక అందమైన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా.

ఓటీటీలోకి క్రైమ్, హారర్, సస్పెన్స్ థ్రిల్లర్లు కుప్పలు తెప్పలుగా వస్తూనే ఉన్నాయి. వీటి మధ్యలో ఫ్యామిలీ ఆడియన్స్ కు కాస్త ఉపశమనం ఇచ్చేలా, ఇంట్లో కుటుంబమంతా కలిసి కూర్చొని చూసేలా దిల్‌వాలీ దివాళీ మూవీని నెట్‌ఫ్లిక్స్‌ తీసుకొచ్చింది. దీపావళి పండగను ముందే తెస్తూ గురువారం నుంచే ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తోంది.

దిల్‌వాలీ దివాళీ మూవీ స్టోరీ విషయానికి వస్తే.. ఇది ఒక పక్కా ఫ్యామిలీ ఎమోషనల్...