భారతదేశం, ఆగస్టు 17 -- Netflix OTT: కోట్లాది మంది వీక్షకాదరణ పొందిన హాలీవుడ్ ఎపిక్ డ్రామా 'స్పార్టాకస్' (Spartacus), పాపులర్ మ్యూజికల్ సిరీస్ 'నాష్‌విల్లే' (Nashville) నెట్‌ఫ్లిక్స్ (Netflix) అమెరికా లైబ్రరీ నుంచి నిష్క్రమిస్తున్నాయి. లైసెన్సింగ్ ఒప్పందం ముగియడంతో ఈ రెండు సిరీస్ లను తొలగించనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అనౌన్స్ చేసింది.

నెట్‌ఫ్లిక్స్ తన సబ్ స్క్రైబర్స్ కు ఊహించని షాక్ ఇచ్చింది. ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్.. రెండు పాపులర్ వెబ్ సిరీస్ లైన స్పార్టాకస్, నాష్‌విల్లే ను తొలగించనుంది. సెప్టెంబర్ 14, 2026ను ఈ రెండు షోలను చూడటానికి ఆఖరి తేదీగా నిర్ణయించింది నెట్‌ఫ్లిక్స్.

గత ఏడాది మాత్రమే నెట్‌ఫ్లిక్స్‌లోకి అడుగుపెట్టిన ఈ సిరీస్‌లు రికార్డు స్థాయి వ్యూవర్ షిప్ సాధించినప్పటికీ, కేవలం 12 నెలల లైసెన్స్ గడువు ముగియడంతో ప్లాట్‌ఫామ్ నుంచి వెళ్లిపోతు...