భారతదేశం, నవంబర్ 23 -- Netflix OTT Sequel Movie Chor Nikal Ke Bhaga 2: డిజిటల్ ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెట్టిన సూపర్ హిట్ హీస్ట్ థ్రిల్లర్ 'చోర్ నికల్ కే భాగా' (Chor Nikal Ke Bhaaga) మళ్లీ ఓటీటీలోకి సందడి చేసేందుకు సిద్ధమైంది. 2023లో ఓటీటీ రిలీజ్ అయి హిందీతో పాటు తెలుగు డబ్బింగ్ వెర్షన్‌లోనూ భారీ వ్యూస్ సాధించిన ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ రాబోతోంది.

'చోర్ నికల్ కే భాగా 2' పేరుతో రూపొందిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 17 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ నవంబర్ 23న అంటే ఇవాళ అధికారికంగా వెల్లడించింది. తెలుగు ప్రేక్షకులకు 'నువ్విలా', 'గౌరవం' సినిమాలతో సుపరిచితురాలైన యామీ గౌతమ్, యువ నటుడు సన్నీ కౌశల్ ఈ రెండో భాగంలోనూ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

తొలి భాగంలో ఆకాశంలో ఎగిరే విమానంలో వజ్రాల దోపిడీ నేపథ్యంలో కథ నడవగా, ఈసారి...