భారతదేశం, జూలై 1 -- Netflix OTT: నెట్‌ఫ్లిక్స్‌లో క్రేజీ మిస్టరీ అడ్వెంచర్ ఫ్రాంచైజీలలో 'ఎనోలా హోమ్స్' ఒకటి. షెర్లాక్ హోమ్స్ సోదరిగా ఎనోలా చేసే సాహసాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూత్‌ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈ సిరీస్ నుంచి మూడో పార్ట్ 'ఎనోలా హోమ్స్ 3' సరికొత్త మిస్టరీతో ఓటీటీలోకి వచ్చేసింది. డైరెక్ట్ గా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది.

మిస్టరీ అడ్వెంచర్ థ్రిల్లర్ 'ఎనోలా హోమ్స్'లో మూడో పార్ట్ ఓటీటీలోకి వచ్చేసింది. బుధవారం (జూలై 1) నుంచి ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం ఇంగ్లీష్ తో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో డిజిటల్ ఆడియన్స్ కోసం అందుబాటులోకి వచ్చింది.

ఈ మూడో భాగం కథ ఎనోలా హోమ్స్ జీవితంలో ఒక కీలక మలుపుతో ప్రారంభమవుతుంది. ఎనోలా హోమ్స్, లార్డ్ ఎర్నెస్ట్ ట్యూక్స్‌బరీల వివాహానికి సర్వం సిద్ధమవుతుంది. అయితే, పెళ్ల...