భారతదేశం, మే 21 -- Netflix Movie: బాలీవుడ్‌లో సరికొత్త జోనర్‌తో అలరించేందుకు సిద్ధమైంది 'మా బహెన్'. ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్‌ను స్కిప్ చేసి, నేరుగా డిజిటల్ వేదికపైకి రాబోతోంది. 'తుమ్హారీ సులు', 'జల్సా' వంటి విభిన్న చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు సురేష్ త్రివేణి ఈ నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ మూవీని రూపొందించారు. ఒక విభిన్నమైన క్రైమ్ కామెడీ కథాంశంతో వస్తున్న ఈ సినిమాపై ప్రస్తుతం ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

'మా బహెన్' మూవీ ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ లో ప్రపంచవ్యాప్తంగా జూన్ 4న విడుదల కానుంది. ఈ మేరకు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా స్ట్రీమింగ్ తేదీని ప్రకటించింది. ఈ మూవీతో ప్రముఖ డిజిటల్ కంటెంట్ క్రియేటర్ ధర్నా దుర్గా బాలీవుడ్‌లోకి నటిగా అడుగుపెడుతుండటం విశేషం.

ఒక మధ్యతరగతి కుటుంబంలో ఎవరూ ఊహించని విధంగా జరిగే విచిత్ర పరిణామాల చుట...