భారతదేశం, నవంబర్ 25 -- Netflix Horror Thrillers: చీకటి గదిలో ఒంటరిగా కూర్చుని హారర్ సినిమాలు చూడటంలో ఉండే కిక్కే వేరు. ప్రేక్షకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే హారర్, సూపర్ నేచురల్ థ్రిల్లర్ కంటెంట్‌కు ఓటీటీ వేదికలపై ఎప్పుడూ భారీ డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో హారర్ ప్రియుల కోసం ప్రముఖ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో 16 అత్యుత్తమ హారర్, థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్‌ల ప్రత్యేక వాచ్‌లిస్ట్‌ను విడుదల చేసింది.

హాలీవుడ్, కొరియన్, స్పానిష్, తైవానీస్, బాలీవుడ్ భాషల్లో అత్యధిక ఐఎండీబీ (IMDb) రేటింగ్స్ సాధించిన ఆ 16 భయానక చిత్రాల జాబితాను ఇప్పుడు చూద్దాం.

1. ఇట్ (IT - 2017) | IMDb రేటింగ్: 7.3: చిన్నపిల్లలను లక్ష్యంగా చేసుకుని వేటాడే 'పెన్నీవైజ్' అనే భయంకరమైన జోకర్ చుట్టూ సాగే సూపర్ నేచురల్ హారర్ చిత్రమిది. ...