భారతదేశం, ఆగస్టు 4 -- Netflix: ప్రముఖ అంతర్జాతీయ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సౌత్ మూవీ లవర్స్‌కు ఒకేసారి రెండు బిగ్ షాక్స్ ఇచ్చేందుకు రెడీ అయింది. లేడీ సూపర్‌స్టార్ సమంత రుత్ ప్రభు నటించిన 'ఓ బేబీ' (Oh Baby), బాలీవుడ్ భామ తాప్సీ పన్ను ప్రయోగాత్మక చిత్రం 'గేమ్ ఓవర్' (Game Over) సినిమాలు త్వరలోనే నెట్‌ఫ్లిక్స్ లైబ్రరీ నుంచి వెళ్లిపోనున్నాయి.

2019లో కేవలం నెల రోజుల తేడాతో థియేటర్లలోకి వచ్చిన ఈ రెండు వుమెన్ సెంట్రిక్ సినిమాలు, డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కాంట్రాక్ట్ ముగియడంతో ఈ వేదికకు శాశ్వతంగా గుడ్‌బై చెప్పబోతున్నాయి.

మొదటగా తాప్సీ పన్ను మైండ్ బెండింగ్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ 'గేమ్ ఓవర్' ఆగస్టు 12, 2026న నెట్‌ఫ్లిక్స్ నుంచి వెళ్లిపోనుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 2, 2026 నాటికి సమంత సూపర్ హిట్ ఎంటర్‌టైనర్ 'ఓ బేబీ' లైబ్రరీ నుంచి కనుమరుగవుత...