భారతదేశం, ఏప్రిల్ 18 -- Netflix: వీకెండ్ లో ఓటీటీలో ఏం చూడాలో అర్థం కావడం లేదా? మంచి డార్క్ కామెడీ సిరీస్ కోసం సెర్చ్ చేస్తున్నారా? అయితే ఆగండి, ఈ న్యూస్ మీకోసమే. నెట్‌ఫ్లిక్స్‌లో తప్పక చూడాల్సిన ఈ డార్క్ కామెడీ సిరీస్ పై ఓ లుక్కేయండి. ఆ సిరీస్ పేరు 'ఆఫ్టర్‌లైఫ్'.

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 'ఆఫ్టర్ లైఫ్' డార్క్ కామెడీ సిరీస్ ఓ మస్ట్ వాచ్ సిరీస్ అని చెప్పొచ్చు. ఇది ఒక బ్రిటిష్ డ్రామా టీవీ సిరీస్. దీనిని రిక్కీ గెర్వైస్ సృష్టించాడు.ఈ సిరీస్ మిమ్మల్ని నవ్విస్తుంది. కొన్ని చోట్ల ఆహా అనిపిస్తుంది. మరికొన్ని చోట్ల కాస్త అసౌకర్యాన్ని కూడా కలిగిస్తుంది.

ఈ ఆఫ్టర్ లైఫ్ సిరీస్ ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమయంలో వచ్చే ఒక అంశం గురించి మాట్లాడుతుంది. ఈ సిరీస్‌లో మూడు సీజన్‌లు ఉన్నాయి. ఆఫ్టర్‌లైఫ్ అనేది ట్యాంబరీ అనే సిటీలో నివసించే టోనీ జా...