భారతదేశం, అక్టోబర్ 29 -- Netflix India Director Ruchikaa Kapoor Sheikh About OTT Trends: డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు వచ్చాక భారతీయ సినిమా రూపురేఖలే మారిపోయాయి. థియేటర్లలో భారీ బడ్జెట్ సినిమాలు సాధించే కలెక్షన్ల లెక్కలకు భిన్నంగా ఓటీటీలో కంటెంట్ మాత్రమే రాజాని నిరూపిస్తోంది. మన తెలుగు ప్రేక్షకులు కూడా థ్రిల్లర్లు, కొత్త తరహా కథాంశాలను ఓటీటీల్లో ఆదరించడంలో ముందంజలో ఉన్నారు.

ఈ నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్ ఇండియా ఒరిజినల్ ఫిల్మ్స్ డైరెక్టర్ రుచికా కపూర్ షేక్ నెట్‌ఫ్లిక్స్ సాధించిన విజయాలు, మారిన ప్రమోషన్ల శైలి, అసలైన హిట్ అంటే ఏంటి అనే అంశాలపై కీలక విశేషాలు పంచుకున్నారు.

డిజిటల్ మీడియాలో సినిమాల విజయాల సరళి గతంతో పోలిస్తే పూర్తిగా మారిపోయిందని రుచికా వ్యాఖ్యానించారు. ఒకప్పుడు ఏడాదికి ఒకటి లేదా రెండు పెద్ద సినిమాలు మాత్రమే సంచలనం సృష్టించేవని, అయితే ...