భారతదేశం, ఏప్రిల్ 22 -- దేశీయ ఎఫ్ఎంసీజీ (FMCG) రంగంలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న నెస్లే ఇండియా (Nestle India), మార్చి త్రైమాసిక ఫలితాల్లో సరికొత్త రికార్డులను సృష్టించింది. గత కొన్ని త్రైమాసికాల్లో చూడని విధంగా ఆదాయం, అమ్మకాల పరిమాణం (Volume Growth), ఎబిటా (Ebitda) మార్జిన్లలో అద్భుతమైన వృద్ధిని కనబరిచింది. జనవరి-మార్చి (Q4FY26) కాలానికి కంపెనీ నిర్వహణ ఆదాయం 22.6 శాతం వృద్ధి చెంది రూ.6,748 కోట్లకు చేరుకుంది.

అయితే, ఈ అంకెలు చూసి మురిసిపోతున్న ఇన్వెస్టర్లకు విశ్లేషకులు ఒక హెచ్చరిక జారీ చేస్తున్నారు. ప్రస్తుత జోరు బాగున్నా, 2027 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి మందగించే (Cool-down) అవకాశాలు మెండుగా ఉన్నాయని హెచ్చరిస్తున్నారు.

నెస్లే ఇంతటి భారీ వృద్ధిని సాధించడానికి ముఖ్యంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది, కంపెనీ తన పంపిణీ వ్యవస్థను గ్...