భారతదేశం, ఆగస్టు 30 -- హిమాలయాల ఒడిలో ఊహించని ప్రకృతి విపత్తు తీవ్ర బీభత్సాన్ని సృష్టించింది! నేపాల్, టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో కొన్ని రోజుల క్రితం సంభవించిన ఆకస్మిక వరదలు.. ఊళ్లకు ఊళ్లనే తుడిచిపెట్టేశాయి. గడిచిన కొద్ది రోజులుగా నరకాన్ని తలపిస్తున్న ఈ ప్రాంతంలో రెస్క్యూ బృందాలు జరుపుతున్న సహాయక చర్యల్లో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆదివారం నాటికి నేపాల్, టిబెట్ సరిహద్దు పరిధిలో దాదాపు 734 మంది మృతదేహాలను అధికారులు వెలికితీశారు. కనీసం 3,000 మందికి పైగా ఆచూకీ లేకుండా పోయినట్లు అధికారిక వర్గాలు ధృవీకరించాయి.

టిబెట్ వైపు ప్రారంభమైన ఈ ప్రళయ ప్రవాహం బుధవారం ఉదయం నేపాల్ సరిహద్దుల గుండా ఉధృతంగా విరుచుకుపడింది. రాజధాని కాట్మండుకు నైరుతి దిశలో ఉన్న రసువా, ధాడింగ్, నువాకోట్ జిల్లాల్లో భోటేకౌశి నది ప్రవాహం ఒక్కసారిగా ఉప్పొంగడంతో ప...