భారతదేశం, మే 3 -- నెల్లూరు జిల్లా దగదర్తి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టు పట్టాలెక్కడానికి సిద్ధమవుతుందనుకున్న సమయంలో భూసేకరణ గురించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరోసారి గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ప్రక్రియ నత్తనడకన సాగుతుండటంతో అటు అధికారులు, ఇటు రైతులు అయోమయంలో ఉన్నారు.
విమానాశ్రయం కోసం మొత్తం 1379.71 ఎకరాలు అవసరం కాగా, అధికారులు ఇప్పటివరకు సగం దూరం మాత్రమే పూర్తి చేయగలిగారు. 689.71 ఎకరాల సేకరణ పూర్తయి, పరిహారం కూడా పంపిణీ చేశారు. మిగిలిన 690 ఎకరాల సేకరణ ఇప్పుడు అత్యంత క్లిష్టంగా మారింది.
దామవరం పరిధిలోని సర్వే నంబర్ల చుట్టూ ఇప్పుడు వివాదం ముదురుతోంది. సర్వే నంబర్ 1-1: ఇక్కడ 176 మంది రైతులకు సంబంధించి 431.36 ఎకరాల శాశ్వత లీజు భూములు ఉన్నాయి. గతంలో జరిగిన అవకతవకల వల్ల రైతులు, పారిశ్రామికవేత్తల మధ్య వివాదం కోర్టు మెట్లెక్కింది....
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.