భారతదేశం, జూన్ 13 -- మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష 'నీట్ యూజీ రీ-ఎగ్జామినేషన్ ' రాసే విద్యార్థులకు ఊరటనిచ్చేలా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నెల 21న (జూన్ 21, 2026) జరగబోయే నీట్ యూజీ రీ-ఎగ్జామ్ కోసం విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉండేలా సరికొత్త మార్పులను ప్రవేశపెట్టింది. పరీక్షను అత్యంత పారదర్శకంగా, పటిష్టమైన భద్రతతో పాటు అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వహించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు ఎన్‌టీఏ స్పష్టం చేసింది.

అధికారిక ప్రకటన ప్రకారం.. నీట్ యూజీ రీ-ఎగ్జామ్ సింగిల్ షిఫ్ట్​లో మధ్యాహ్నం 2:00 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు జరగనుంది. గతంతో పోలిస్తే ఈసారి పరీక్ష సమయాన్ని మరో 15 నిమిషాలు అదనంగా పెంచారు. పరీక్షా కేంద్రంలో హాజరు పట్టికపై సంతకాలు చేయడం, బయోమెట్రిక్ నమోదు వంటి తప్పనిసరి అధికారిక ప్రక్...