భారతదేశం, జూలై 17 -- వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత విడుదల చేసింది. దేశవ్యాప్తంగా దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాయగా.. అందులో 11.21 లక్షల మంది ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ లాంటి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హత సాధించారు. ఈసారి ఫలితాల్లో అమ్మాయిలు స్పష్టమైన ఆధిక్యత కనబరిచారు. పరీక్ష పాసైన వారిలో 58 శాతానికి పైగా విద్యార్థినులే ఉన్నారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ స్కోర్‌కార్డులను అధికారిక వెబ్‌సైట్ (neet.nta.nic.in) నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఈ ఏడాది నీట్ యూజీ రీ-ఎగ్జామ్‌లో పంజాబ్‌కు చెందిన ఆర్యన్ గుప్తా, హర్యానాకు చెందిన పాన్షుల్ బన్సల్ 720 మార్...