భారతదేశం, ఆగస్టు 12 -- వైద్య విద్యనభ్యసించి డాక్టర్ కావాలనుకునే నిరుపేద, ప్రతిభావంతులైన విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. 2027 జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (NEET UG 2027)కు సిద్ధమయ్యే అభ్యర్థుల కోసం ఉచిత లాంగ్ టర్మ్ కోచింగ్ శిక్షణ ఇచ్చేందుకు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ(TGSWREIS) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకునే అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 22వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సొసైటీ కార్యదర్శి కంభంపాటి శారద తెలిపారు.

2026 - 27 అకాడెమిక్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ లాంగ్ టర్మ్ నీట్ శిక్షణను అందించనున్నారు. హైదరాబాద్‌ కేంద్రంగా బాలురు, బాలికలకు వేర్వేరు క్యాంపస్‌లలో ఉచిత వసతి భోజన సౌకర్యాలతో ఈ శిక్షణ ఉంటుంది.

బాలుర(100 సీట్లు)కు చిలుకూరులోని టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ (TGSWR) ఫౌండేషన్ సెంటర్ ...