భారతదేశం, జూన్ 25 -- NBK112 Budget: నందమూరి బాలకృష్ణ బాక్సాఫీస్ దగ్గర అస్సలు తగ్గడం లేదు. వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్‌ను లైన్ లో పెడుతూ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో తన 111వ సినిమా (NBK111) షూటింగ్‌తో బిజీగా ఉన్న బాలయ్య.. తాజాగా తన నెక్స్ట్ మైల్‌స్టోన్ ప్రాజెక్ట్ 'NBK112' ను అధికారికంగా ప్రారంభించారు.

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఒక భారీ పాన్ ఇండియా ఎంటర్‌టైనర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఓపెనింగ్ గురువారం (జూన్ 25) ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఘనంగా జరిగింది.

ఈ ఎన్‌బీకే 112 మూవీ గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌కు ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర యూనిట్‌కు బెస్ట్ విషెస్ చెప్పారు. పూజా కార్యక్ర...