భారతదేశం, జూన్ 10 -- NBK Birthday Special: టాలీవుడ్ బాక్సాఫీస్ సామ్రాజ్యాన్ని దశాబ్దాలుగా శాసిస్తున్న 'గాడ్ ఆఫ్ మాసెస్' నందమూరి బాలకృష్ణ (NBK) బర్త్ డే ఈ రోజు (జూన్ 10). విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా.. యాభై ఏళ్లకు పైగా తన స్వయంకృషితో ట్రేడ్ లెక్కలను తిరగరాస్తున్నారు బాలయ్య. 66వ పుట్టిన రోజు సందర్భంగా బాలకృష్ణ బాక్సాఫీస్ రాంపేజ్ ను ఓ సారి చూసేద్దాం.

టాలీవుడ్‌లో ఒక హీరో వయసు 60 దాటితే సాధారణంగా క్యారెక్టర్ రోల్స్ లేదా స్లో పీస్ సినిమాలు చేస్తుంటారు. కానీ నందమూరి బాలకృష్ణ విషయంలో ట్రెండ్ పూర్తిగా రివర్స్ అయింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆయన అందుకుంటున్న విజయాలు, క్రియేట్ చేస్తున్న మార్కెట్ వాల్యూ ట్రేడ్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది.

కరోనా విపత్కర పరిస్థితుల తర్వాత టాలీవుడ్ కుదేలైన సమయంలో.. థియేటర్లలోకి ఆడియన్...