భారతదేశం, అక్టోబర్ 1 -- Yami Gautam Nayyi Navelli Trailer Released: జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం అందుకుని మంచి ఫామ్‌లో ఉన్న బాలీవుడ్ భామ యామీ గౌతమ్ మరో విభిన్న కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. బాలాజీ మోహన్ దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ మిస్టరీ ఫ్యామిలీ ఫాంటసీ కామెడీ ఎంటర్‌టైనర్ 'నయ్యి నవెల్లి' ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు.

ఇప్పటివరకు గంభీరమైన, సీరియస్ పాత్రలతో మెప్పించిన బ్యూటిఫుల్ యామీ గౌతమ్ ఈసారి కామెడీ, భయం కలగలిపిన సరికొత్త అవతారంలో అలరించేందుకు వస్తున్నారు. నయ్యి నవెల్లి ట్రైలర్ పరిశీలిస్తే, అవాస్థి కుటుంబంలోకి మోహిని (యామీ గౌతమ్) కొత్త కోడలిగా అడుగుపెట్టడంతో కథ ప్రారంభమవుతుంది.

ఇంట్లోని వారంతా కొత్త కోడలికి ఆనందంగా ఘన స్వాగతం పలుకుతారు. చూడటానికి ఎంతో పద్ధతిగా, అమాయకంగా కనిపించే ఆ కొత్త కోడలి ప్రవర్తనల...