భారతదేశం, మార్చి 31 -- Nayanthara: మరో క్రేజీ కాంబినేషన్ కు రంగం సిద్ధమైంది. టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి, బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్‌తో ఒక భారీ ప్రాజెక్టును ప్రకటించి సినీ ప్రియులను ఆశ్చర్యపరిచిన విషయం తెలుసు కదా. అయితే ఈ ప్రాజెక్టులోకి ఇప్పుడు నయనతార కూడా వచ్చి చేరింది. దీంతో ఈ ముగ్గురి కాంబినేషన్ ఏం మ్యాజిక్ చేయబోతోందో అన్న ఆసక్తి నెలకొంది.

ఈ భారీ ఎంటర్‌టైనర్‌లో బాలీవుడ్ సుల్తాన్ సల్మాన్ ఖాన్ సరసన దక్షిణాది అగ్ర కథానాయిక నయనతార నటించనుంది. "అత్యున్నత నైపుణ్యం, వైవిధ్యానికి మారుపేరైన నయనతార.. సల్మాన్ ఖాన్ - వంశీ పైడిపల్లి మూవీలో చేరుతున్నారు. ఒక ప్రత్యేకమైన ప్రాజెక్టు కోసం మిమ్మల్ని ఆహ్వానించడం మాకు గర్వకారణం" అని చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే 'జవాన్' చిత్రంతో హిందీ ప్రేక్షకులను మెప్పించిన నయనత...