భారతదేశం, సెప్టెంబర్ 27 -- Narayanamma Song: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'ఆదర్శ కుటుంబం'. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ 'నారాయణమ్మ' ఈ రోజు (సెప్టెంబర్ 27) విడుదలయ్యింది. ఈ సాంగ్ ఇన్ స్టంట్ హిట్ గా మారింది.

ఆదర్శ కుటుంబం సినిమా నుంచి 'నారాయణమ్మ' సాంగ్ వచ్చేసింది. తమన్ మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చిన ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాశారు. రామ్ మిరియాల, ప్రభ బంగారిగల్ల పాడారు.

డింపుల్ హయాతి కిల్లర్ డ్యాన్స్ మూమెంట్స్, వెంకటేష్ ఎనర్జిటిక్ స్క్రీన్ ప్రెజెన్స్, శ్రీనిధి శెట్టి, నివేదా పేతురాజ్ గ్లామర్ ఈ పాటలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అక్టోబర్ 9న విడుదల కానున్న ఈ ఆదర్శ కుటుంబం సినిమాకు ఈ పాట భారీ హైప్‌ను తీసుకొచ్చింది.

అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫస్ట్ సింగిల...