భారతదేశం, సెప్టెంబర్ 25 -- Nani Reaction: నేచురల్ స్టార్ నాని నటించిన మోస్ట్ ఏవైటెడ్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'ది పారడైజ్' థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్ దగ్గర హల్‌చల్ చేస్తోంది. ఒకపక్క రికార్డ్ ఓపెనింగ్స్ సాధిస్తున్నప్పటికీ, మరోపక్క సినిమాపై నెటిజన్ల నుంచి ట్రోల్స్, క్రిటిక్స్ నుంచి మిక్స్‌డ్ రివ్యూస్ వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో హీరో నాని సోషల్ మీడియా వేదికగా చేసిన ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు ట్రెండింగ్ లోకి వచ్చింది.

ఆడియెన్స్ నుంచి వచ్చిన ప్రతీ రెస్పాన్స్ ని తాను గమనించానని నాని తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నాడు. "మీరు చూపిస్తున్న ప్రేమని ఎంతగా స్వీకరించానో, మీ నుంచి వచ్చిన నవ్వు తెప్పించే ట్రోల్స్ ని కూడా అంతే ఎంజాయ్ చేశాను. ఆడియెన్స్ ఈ సినిమాని తమ సొంతం చేసుకున్న తీరు నా మనసుని తాకింది. క్రిటిక్స్, రివ్యూవర్స్ వేలెత్తి చూపించిన తప్పుల నుంచి...