భారతదేశం, అక్టోబర్ 21 -- Nani: టాలీవుడ్‌లో స్వయంకృషితో ఎదిగి, తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న 'నేచురల్ స్టార్' నాని ప్రస్తుతం వరుస వైవిధ్యమైన చిత్రాలతో దూసుకుపోతున్నారు. 'దసరా' వంటి మాస్ బ్లాక్‌బస్టర్ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో ఆయన నటించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా 'ది పారడైజ్' (The Paradise) ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది.

ఈ సందర్భంగా వెరైటీ ఇండియా మ్యాగజైన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో నాని తన సినీ ప్రయాణం, పాన్-ఇండియా సినిమాల ప్రెషర్, కథల ఎంపికపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త దర్శకులను ప్రోత్సహించడం, 'ది పారడైజ్' తర్వాత రాబోయే 'బ్లడీ రోమియో' విశేషాలు, ఇండస్ట్రీలో ఔట్‌సైడర్‌గా తన ప్రయాణాన్ని ప్రత్యేక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

ప్రస్తుతం టాలీవుడ్‌లో ప్రతీ సినిమానూ పాన్-ఇండియా లేదా గ్లోబల్ స్థాయిలో నిర్మించ...