భారతదేశం, సెప్టెంబర్ 19 -- Nani: ది ప్యారడైజ్ ప్రమోషన్లలో బిజీగా ఉన్న నేచురల్ స్టార్ నాని వరుసగా పాన్ ఇండియా ప్రెస్ మీట్లతో సాగిపోతున్నారు. రీసెంట్ గా బెంగళూరులో ప్రెస్ తో నాని మాట్లాడారు. ఆ సమయంలో 'ది పారడైజ్' సినిమాలో తాను పోషించిన 'జడల్' పాత్ర గురించి మాట్లాడుతూ నాని నేటి తరం మహిళల హెయిర్‌స్టైల్స్‌పై వ్యాఖ్యలు చేశారు.

ఈ రోజుల్లో మహిళలు జడలు వేసుకోవడం మానేశారని, జడలు వేసుకుంటే మహిళలు చాలా అందంగా కనిపిస్తారని నాని చెప్పారు. మన తల్లుల కాలంలో జుట్టుకు నూనె రాసి జడ వేసేవారని, కానీ ఇప్పుడు వెస్టర్న్ కల్చర్ ప్రభావం వల్ల జడలు వేసుకోవడం తగ్గిపోయి జుట్టు రాలే సమస్యలు పెరుగుతున్నాయని అన్నారు.

ఈ క్రమంలో ప్రెస్ మీట్‌లో ఉన్న ఒక లేడీ జర్నలిస్ట్‌ను చూపిస్తూ మీరు కూడా జడ వేసుకోలేదని నాని అనడం చర్చకు దారితీసింది.

నాని వ్యాఖ్యలకు మరో లేడీ రిపోర్టర్ నవ...