భారతదేశం, జూలై 8 -- Nandini Reddy: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కమర్షియల్ సక్సెస్ వర్సెస్ కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాల మధ్య ఎప్పుడూ ఒక డిబేట్ నడుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్లను కేవలం గ్లామర్ బొమ్మలుగా చూపించడంపై (Objectification) ఈ మధ్య కాలంలో విమర్శలు ఎక్కువయ్యాయి. హిందూస్థాన్ టైమ్స్‌తో ఇంటర్వ్యూలో దీనిపై డైరెక్టర్ నందనీ రెడ్డి రియాక్టయ్యారు.

జూన్ 4న విడుదలైన 'పెద్ది' (Peddi) సినిమాలో జాన్వీ కపూర్ పాత్రను డిజైన్ చేసిన విధానంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచినప్పటికీ, ఉమెన్ ఆబ్జెక్టిఫికేషన్ వివాదం మాత్రం గట్టిగానే నడిచింది.

సరిగ్గా ఈ వివాదం నడుస్తున్న సమయంలోనే జూన్ 19న విడుదలైన సమంత రూత్ ప్రభు యాక్షన్ డ్రామా 'మా ఇం...