భారతదేశం, అక్టోబర్ 30 -- Namit Malhotra: భారతీయ చలనచిత్ర రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్తూ, రాబోయే నవంబర్ 5న అంతర్జాతీయంగా థియేటర్లలోకి రాబోతున్న చిత్రం 'రామాయణ' (Ramayana: Part 1). రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా అంచనా వ్యయం ఏకంగా రూ. 4,000 కోట్లు. ఇంతటి మైండ్ బ్లాకింగ్ ప్రాజెక్ట్‌ను హాలీవుడ్ స్థాయిలో నిర్మిస్తున్న నిర్మాత నమిత్ మల్హోత్రా జీవిత ప్రయాణం ఏ సినిమా కథకూ తక్కువ కాదు.

ఒక సాధారణ ముంబై యువకుడి స్థాయి నుంచి హాలీవుడ్‌ను శాసించే వీఎఫ్ఎక్స్ (VFX) విజనరీగా ఆయన ఎలా మారారో ఇటీవల లాస్ ఏంజెల్స్‌లోని ఆస్కార్ అకాడమీ మ్యూజియంలో జరిగిన ప్రదర్శన వేదికగా స్వయంగా పంచుకున్నారు. 2008 ఆర్థిక మాంద్యంలో తన ఆస్తిలో ఏకంగా 90% కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి నుంచి కోలుకుని, హాలీవుడ్ దిగ్గజాలు క్రిస్టోఫర్ నోలన్, డెనిస్ విల్లెనూవ్‌లతో కలిసి పనిచేసే స...