భారతదేశం, ఆగస్టు 28 -- Nagarjuna Netflix: అక్కినేని నాగార్జున పుట్టినరోజు సందడి వేళ ఫ్యాన్స్ కు బిగ్ షాక్ తగిలింది. ఆయన నటించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'మన్మథుడు 2' సెప్టెంబర్ 22, 2026న నెట్‌ఫ్లిక్స్ నుంచి నిష్క్రమించనుంది. నాగార్జున తన పుట్టినరోజును ఆగస్టు 29, 2026న జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్ షాక్ ఇచ్చినట్లయింది.

నాగార్జున బర్త్ డే సందర్భంగా ఆయన అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక 100వ చిత్రం (#King100) కి సంబంధించిన క్రేజీ అప్‌డేట్ లేదా టైటిల్ గ్లింప్స్ వెలువడుతుందనే ఆశతో అక్కినేని ఫ్యాన్స్ తీవ్ర ఉత్సాహంతో ఉన్నారు. ఒకవైపు ఈ మైల్‌స్టోన్ ప్రాజెక్ట్ గురించిన వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుండగా, మరోవైపు ఆయన నటించిన సీక్వెల్ మన్మథుడు 2 సినిమాకు సంబంధించి ఓటీటీలో కీలక పరిణామం చోటుచేసుకుంది....