భారతదేశం, ఏప్రిల్ 19 -- Nagarjuna Fitness Secrets At Age 60: టాలీవుడ్‌లో కింగ్ నాగార్జున గురించి పరిచయం అక్కర్లేదు. 60 ఏళ్లు దాటినా ఆయనను చూస్తుంటే వయసు కేవలం ఒక అంకె మాత్రమే అనిపిస్తుంది. సాధారణంగా రిటైర్‌మెంట్ గురించి ఆలోచించే వయసులో, నాగార్జున మాత్రం కొత్త ఉత్సాహంతో దూసుకుపోతున్నారు.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన ఫిట్‌నెస్ ప్రయాణం, డైట్ ప్లాన్ గురించి నాగార్జున పంచుకున్న విశేషాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దశాబ్దాలుగా పాటిస్తున్న నియమాలే తనను ఇంత ఫిట్‌గా ఉంచాయని నాగ్ పేర్కొన్నారు.

నాగార్జున దినచర్యలో వర్కవుట్ ఎంతటి ప్రాముఖ్యత ఉందో నాగార్జున మాటల్లోనే అర్థం చేసుకోవచ్చు. "ఉదయం నిద్రలేవగానే నా ఫస్ట్ ప్రయారిటీ ఎక్సర్‌సైజ్ మాత్రమే. అసలు వ్యాయామం చేయని రోజంటూ ఉండదు. వర్కవుట్ చేయలేకపోతే ఆ రోజు షూటింగ్‌కు కూడా వెళ్లకూడదని నిర్ణయించు...