భారతదేశం, ఆగస్టు 14 -- Nagarjuna Digital Arrest: నాగార్జున కుటుంబంలో తీవ్ర కలకలం రేపిన ఒక సైబర్ మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అక్కినేని నాగార్జున తనకు అత్యంత దగ్గరి బంధువు ఒకరు సైబర్ కేటుగాళ్ల వలలో పడి ఏకంగా 6 నుంచి 7 గంటల పాటు 'డిజిటల్ అరెస్ట్'కు గురైన షాకింగ్ ఘటనను బయటపెట్టారు. కస్టమ్స్ అధికారులమంటూ ఫోన్ చేసిన స్కామర్లు, ఆ తర్వాత పోలీసుల అవతారం ఎత్తి ఎలా భయపెట్టారో ఆయన క్లియర్‌గా వివరించారు.

నాగార్జున తెలిపిన వివరాల ప్రకారం.. ఈ హైడ్రామా ఒక ఫేక్ ఫోన్ కాల్‌తో స్టార్ట్ అయింది. సదరు బంధువు పేరు మీద ఇరాన్ దేశానికి ఒక కొరియర్ పార్సిల్ వెళ్తోందని, అందులో నిషేధిత డ్రగ్స్ (నార్కోటిక్స్) ఉన్నాయని కస్టమ్స్ ఆఫీసర్ల పేరుతో కేటుగాళ్లు బెదిరించారు.

వెంటనే 'పోలీస్ డిపార్ట్‌మెంట్' నుంచి మాట్లాడేస్తున్నామంటూ మరో కాల్ వచ్చింది. ఆ తర్వాత పోలీసు యూని...