భారతదేశం, ఆగస్టు 11 -- Nagarjuna: ఓ వైపు హీరోగా సినిమాలు తీస్తూనే.. మరోవైపు మూవీస్ నిర్మిస్తూ, డిస్ట్రిబ్యూట్ చేస్తూ బిజీ అయిపోయారు కింగ్ నాగార్జున. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన 'పళ్లబురుసు' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాగ్ చేసిన కామెంట్లు తెగ వైరల్ గా మారాయి. ఈ మూవీ ఆలోచనను ఈ సందర్భంగా కింగ్ పంచుకున్నారు.

అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సరికొత్త నిర్ణయాలు తీసుకున్నామని, నాన్న (ANR) కాలంనాటి పద్ధతిలోనే డిస్ట్రిబ్యూషన్ రంగాన్ని బలోపేతం చేస్తూ మళ్లీ మొదలుపెట్టామని కింగ్ నాగార్జున తెలిపారు. ఈ క్రమంలోనే 'పళ్ళబురుసు' సినిమా చేయడానికి వెనుక ఉన్న ఆసక్తికర కథనాన్ని ఆయన పంచుకున్నారు.

"నా కెరీర్‌లో ఇప్పటివరకు ఆంధ్రా సంస్కృతి, యాస నేపథ్యంలో ఎన్నో సినిమాలు చేశాను, నిర్మించాను. అయితే గతంలో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్ట...