భారతదేశం, అక్టోబర్ 1 -- Naga Vamsi AK47: 'ఆదర్శ కుటుంబం' సినిమా విడుదల తేదీ మారుతుందంటూ వస్తున్న పుకార్లకు నిర్మాత నాగవంశీ సోషల్ మీడియా వేదికగా చెక్ పెట్టారు. తమ సంస్థ విడుదల విషయంలో పంక్చువాలిటీ పాటిస్తుందని, అక్టోబర్ 9న ఈ సినిమా థియేటర్లలోకి రావడం పక్కా అని స్పష్టం చేశారు.

త్రివిక్రమ్ దర్శకత్వంలో ఫస్ట్ టైమ్ వెంకటేష్ హీరోగా చేస్తున్న మూవీ 'ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47'. ఈ మూవీని అక్టోబర్ 2కు రిలీజ్ చేస్తామని ఫస్ట్ ప్రకటించారు. ఆ తర్వాత అక్టోబర్ 9కి పోస్ట్ పోన్ చేశారు. ఇక ఇప్పుడేమో అక్టోబర్ 9కి కూడా రిలీజ్ కాదనే ప్రచారం సాగుతోంది. దీనిపై నాగవంశీ తన ట్వీట్ తో కౌంటర్ ఇచ్చారు.

''మా రిలీజ్ పంక్చువాలిటీ మీద మీకు డౌట్ ఉండొచ్చు. కానీ ఈ సారి అలాంటి డౌట్స్ ఏం వద్దు. మేం అక్టోబర్ 9నే వస్తున్నాం. అందులో ఎలాంటి మార్పు లేదు. అక్టోబర్ 6న ట్రైలర్, 7 ను...