భారతదేశం, మే 13 -- Naga Vamsi: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య నడుస్తున్న ఆదాయ పంపకాల వివాదం (రెవెన్యూ షేరింగ్) హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ప్రముఖ నిర్మాత నాగవంశీ పాల్గొని తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు తలుచుకుంటే ఈ సమస్యను చాలా సులభంగా పరిష్కరించుకోవచ్చని, దీనిపై అనవసరమైన రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

గత కొన్నాళ్లుగా టాలీవుడ్ బాక్సాఫీస్ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదని నాగవంశీ ఆవేదన వ్యక్తం చేశారు.

"ప్రస్తుతం సరైన రెవెన్యూ లేక ఇండస్ట్రీ రక్తం ఓడుతోంది. సంక్రాంతి సీజన్ తర్వాత ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో థియేటర్లకు రావడం లేదు. ఈ వేసవి కాలం కూడా మనకు కలిసి రాలేదు. బలమైన కంటెంట్...