భారతదేశం, జూలై 9 -- Naga Vamsi: అక్కినేని ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ బ్లాక్ బస్టర్ మూమెంట్ రానే వచ్చేసింది. పవర్ ఫుల్ యాక్షన్ డ్రామా 'లెనిన్' (Lenin)తో అఖిల్ బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. సరిగ్గా ఈ టైమ్ లో స్టార్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ ఎక్స్ వేదికగా పెట్టిన ఒక ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

గతంలో వచ్చిన 'ఏజెంట్' (Agent) డిజాస్టర్ తర్వాత అఖిల్ ఏకంగా రెండేళ్ల పాటు ఇండస్ట్రీకి గ్యాప్ తీసుకున్నాడు. ఆ ఫెయిల్యూర్ ఇచ్చిన డిప్రెషన్ నుంచి బయటపడి, తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం రక్తం, చెమట చిందించాడని నాగవంశీ తన ట్వీట్ లో ఓపెన్ గా చెప్పేశాడు. మీ సిసింద్రీ మరో 12 గంటల్లోపే మీ ముందుకు రాబోతున్నాడంటూ అఖిల్ చిన్ననాటి సినిమా గురించి చెప్పాడు....