భారతదేశం, ఆగస్టు 13 -- Naga Vamsi: తమిళ స్టార్ హీరో సూర్య, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబోలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ మూవీ 'విశ్వనాథ్ అండ్ సన్స్' (Vishwanath & Sons) రేపే (ఆగస్ట్ 14) థియేటర్లలోకి వస్తోంది. రిలీజ్ కి కొన్ని గంటల ముందే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ చేసిన ఒక ఎక్స్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ సినిమాపై తనకు ఉన్న మాస్ కాన్ఫిడెన్స్ చూసి ఫ్యాన్స్ ఎగ్జైట్‌మెంట్ నెక్స్ట్ లెవెల్‌కి చేరింది.

"మా బ్యానర్ నుంచి వస్తున్న ఒక సినిమాపై ఇంత స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ వచ్చి సరిగ్గా ఆరేళ్లు అవుతోంది. రేపు థియేటర్లలో మీరు అది స్వయంగా చూస్తారు. ఈ సినిమా చూసి నవ్వుతారు, ఏడుస్తారు, ప్రతి ఎమోషన్ అనుభవిస్తారు. థియేటర్ నుంచి బయటకొచ్చేటప్పుడు విశ్వనాథ్ అండ్ సన్స్ క్యారెక్టర్లను మీ గుండె...