భారతదేశం, మార్చి 7 -- నాగ చైతన్య, శోభితా ధూళిపాళ.. టాలీవుడ్ లోని మోస్ట్ పాపులర్ జోడీల్లో వీళ్లది ఒకటి. తమ పెళ్లి అయినప్పటి నుంచి నాగ చైతన్య, శోభితా తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. తాజాగా ఈ జోడీ పూరీ జగన్నాథుని సేవలో తరించారు. నాగ చైతన్య, శోభితా పూరీ జగన్నాథ్ టెంపుల్ కు వెళ్లారు.
అక్కినేని ఫ్యామిలీ నట వారసుడు నాగ చైతన్య, అతని భార్య శోభితా ధూళిపాళ తాజాగా పూరీ జగన్నాథుడిని దర్శించుకున్నారు. ఒడిషాలోని పూరీలో ఉన్న గుడికి వెళ్లారు. ఈ జంట కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆలయానికి చేరుకుని, గర్భగుడిలో కొంత సమయం గడిపింది. గుడిలోకి వీళ్లు వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ANI న్యూస్ ప్లాట్ ఫామ్ తన ఎక్స్ అకౌంట్లో పంచుకున్న వీడియోలో నాగ చైతన్య సంప్రదాయ ధోవతితో పాటు తెల్ల చొక్కా ధరించి కనిపించాడు. శోభితా ఎర్ర చీరలో ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.